Share News

Tolichowki Incident: హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు

ABN , Publish Date - Dec 15 , 2025 | 07:21 AM

హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా టోలిచౌకి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పారమౌంట్ కాలనీ గెేట్ నంబర్- 3 వద్ద హత్య జరిగింది. ఇర్ఫాన్‌ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

Tolichowki Incident: హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు
Tolichowki Incident

హైదరాబాద్,డిసెంబరు15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ (Hyderabad) నగరంలో వరుస హత్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా టోలిచౌకి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పారమౌంట్ కాలనీ గేట్ నంబర్- 3 వద్ద హత్య జరిగింది. ఇర్ఫాన్‌ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన వెంటనే టోలీచౌకి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇర్ఫాన్‌‌కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇర్ఫాన్‌‌కు సంబంధించిన కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాలనీలోని సీసీటీవీ కెమెరాలను టోలీచౌకి పోలీసులు పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇర్ఫాన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు

హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 15 , 2025 | 07:50 AM