iBomma Ravi Case: ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 08:40 AM
ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడు పెంచారు. రవిని పోలీసులు గత రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
హైదరాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఐబొమ్మ ఇమ్మడి రవి కేసు (iBomma Ravi Case)లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Hyderabad Cyber Crime Police) వేగం పెంచారు. గత రెండు రోజులుగా రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా విచారించారు. విచారణలో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇవాళ (శనివారం) మూడో రోజు కూడా రవిని విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు.
తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలను రవి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. మూవీ రూల్జ్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశానని.. క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్జ్‌కి డబ్బులు చెల్లించానని రవి పోలీసులకు తెలిపాడు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కి గేట్ వేగా చేశాడని.. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతో రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఫ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్‌ని పోస్ట్ చేస్తూ.. కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా ఆఫీసు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ పనిలో భాగంగా 20 మంది యువకులను రవి నియమించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ ఉప్పల సతీష్
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News And Telugu News