Share News

Thigala Krishna Reddy: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి

ABN , Publish Date - Mar 08 , 2025 | 07:11 AM

Thigala Krishna Reddy: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. దాదాపుగా ప్రతిరోజు పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యంత వేగంగా వాహనాలను నడపడం, రాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల చిన్న వయస్సులోనే ప్రాణలు కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు మృతిచెందాడు. ఈఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

 Thigala Krishna Reddy: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి
Outer Ring Road accident

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి(19) మృతిచెందారు. హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ దగ్గర ఔటర్ రింగు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి కనిష్క్ రెడ్డి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రగాయాల పాలయ్యారు.


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రగాయాలపాలయిన యువకుడిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. ఆయనకు చికిత్స అందిస్తుండగానే మృతిచెందారు. లోడ్‌తో ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కనిష్క్ రెడ్డి మృతితో తీగల కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

Gudem Mahipal Reddy: నేను కాంగ్రెసోణ్ని కాదు!

Gachibowli: ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Mar 08 , 2025 | 07:19 AM