Telangana Police: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? జర జాగ్రత్త!
ABN , Publish Date - Jul 30 , 2025 | 09:08 AM
కొంచెం తక్కువ ధరకు వస్తుందని చాలామంది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొంటుంటారు. అయితే, సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనేటప్పుడు ప్రజలు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను సూచిస్తూ తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు.

తెలంగాణ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కొంచెం తక్కువ ధరకు వస్తుందని చాలామంది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు (Second Hand Phones) కొంటుంటారు. అయితే, సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనేటప్పుడు ప్రజలు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను సూచిస్తూ తెలంగాణ పోలీసులు (Telangana Police) ఎక్స్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు. తెలియని వారు ఎవరైనా తక్కువ ధరకే ఫోన్ అమ్ముతానంటే అనుమానించాల్సిందేనని, చోరీకి గురైన ఫోన్ మీకు అమ్మవచ్చని హెచ్చరించారు.
ఓ చిన్న జాగ్రత్తతో సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని, ఆ ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ తీసుకుని దానిని సంచార్ సాధీ.జీఓవి.ఇన్‌లోకి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించారు. సంచార్ సాధీ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ద్వారా మీరు కొనబోతున్న ఫోన్ ఐఎంఈఐ నంబర్ టైప్ చేసి వారు సూచించిన నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపిస్తే క్షణాల్లో ఆ ఫోన్ బ్లాక్ లిస్టులో ఉందా? లేదా? అనే విషయం తెలిసిపోతుందని పోలీసులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రకాష్‌రాజ్‌కు ఈడీ నోటీసులు.. ఇవాళ విచారణకు హాజరు
గుడ్ న్యూస్.. రేవంత్ ప్రభుత్వం మరో కీలకనిర్ణయం.. వాటికి గ్రీన్ సిగ్నల్
Read latest Telangana News And Telugu News