Share News

Telangana High Court: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించలేం: హైకోర్టు

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:26 AM

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.

Telangana High Court: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించలేం: హైకోర్టు
Telangana High Court

హైదరాబాద్, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నిర్వహణపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా..? అని పిటీషనర్‌ను ప్రశ్నించింది హైకోర్టు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో- 46పై హైకోర్టులో ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది.


42 శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పినట్లు హైకోర్టు గుర్తు చేసింది. గతంలో 2009లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్‌ను రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలపగా.. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ అడ్వొకేట్ చెప్పుకొచ్చారు. అయితే, ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని మరోసారి స్పష్టం చేసింది న్యాయస్థానం.


తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి, తామే స్టే ఎలా ఇస్తాం..?? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ క్రమంలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలని కోరారు పిటిషనర్ న్యాయవాది. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. సబ్ కేటగిరి రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం హుకుం జారీ చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 11:50 AM