TG Govt On Employees: ఉద్యోగుల జీతాల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ABN , Publish Date - Oct 25 , 2025 | 06:13 PM
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అక్టోబరు జీతాల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు జీతం చెల్లించొద్దని నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల (Contract And Outsourcing Employees) అక్టోబరు జీతాల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇవాళ (శనివారం) కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు జీతం చెల్లించొద్దని సర్కార్ నిర్ణయం తీసుకుంది. IFMIS పోర్టల్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే అక్టోబరు జీతం కట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని రేవంత్‌రెడ్డి సర్కార్ స్పష్టం చేసింది.
అక్టోబరు 25వ తేదీ అర్ధరాత్రి లోపు ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ట్రెజరీ, వర్క్స్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు అందరూ పాటించాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లింక్ చేయని వారి అక్టోబరు జీతాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సర్క్యులర్‌పై ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంతకం చేశారు. ఈ ఆదేశాలని ఉల్లంఘిస్తే తీవ్రంగా వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుండాలకి రక్షణ కల్పిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. ప్రవీణ్ కుమార్ ఫైర్
గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ
Read Latest Telangana News And Telugu News