Home » Employees
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
‘అవినీతికి పాల్పొడొద్దు. నిబంధనలకు వ్యతిరేకంగా చేయొద్దు. ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు. రాజకీయంగా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. మీ తప్పు లేకుంటే నేను కల్పించుకుని పరిష్కరిస్తా’ అంటూ తహసీల్దార్ల సమావేశాల్లో ప్రతిసారి కలెక్టర్ సుమిత్‌కుమార్ చేస్తున్న సూచనలివీ.
పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోదాలకు ముందు డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్.. ఓ రైతు నుంచి రూ.16,500ల లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..
మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలోని దుండిగల్‌లోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ (గురువారం) సోదాలు నిర్వహించారు. పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తుల వ్యవహారంపై విచారణ చేపట్టారు..
కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో జరిగే ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సన్నాహకాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచిస్తూ ఎన్నికల అధికారులు లేఖ రాశారు..
తెలంగాణ దక్షిణ మండల విద్యుత్ సంస్థలో అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా లంచాలు తీసుకున్న వ్యవహారం బయటపడటంతో 8 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడింది..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ని పరిశుభ్రంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.