Telangana Cabinet meeting: తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకి ఆమోదం
ABN , Publish Date - Oct 16 , 2025 | 07:08 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(గురువారం) మంత్రి మండలి సమావేశం ఏర్పాటు అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.
హైదరాబాద్, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(గురువారం) మంత్రి మండలి సమావేశం (Telangana Cabinet Meeting) ఏర్పాటు అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ, మెట్రో ఫేజ్-2 టెండర్లపై చర్చించినట్లు సమాచారం. మెట్రో ఫేజ్-2పై సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. తన ఇంటికి పోలీసులు రావడంపై ఆగ్రహంగా ఉన్నారు మంత్రి కొండా సురేఖ. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీకి రాకూడదని మంత్రి సురేఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీసీ రిజర్వేషన్లపై చర్చ..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన slp డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించారు. ఈ కేసును వాదించిన సీనియర్ న్యాయ వాదులు, న్యాయ నిపుణుల సలహాలు సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం రేవత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కొత్త వ్యవసాయ కళాశాలలు
అలాగే, జయశంకర్ వర్సిటీకి మూడు కొత్త వ్యవసాయ కళాశాలలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్ వికారాబాద్ జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు..
డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు మంత్రి మండలి నిర్ణయించింది. అలాగే,ఆర్ అండ్ బీ హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.10,500 కోట్లతో నిర్మించే 5500 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదించింది. త్వరలో టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజాస్వామ్యబద్ధంగా డీసీసీ అధ్యక్ష ఎన్నిక: కొండా మురళి
నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జరిగేది ఇదే: పీసీసీ చీఫ్
Read Latest Telangana News And Telugu News