Share News

Raja Singh vs Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 14 , 2025 | 10:23 AM

ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా.' అంటూ.. రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.

Raja Singh vs Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Raja Singh vs Kishan Reddy

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలకు అగ్గి రాజుకుంటోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన మాటల తూటలు వదిలారు. 'కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..? జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా, కాంగ్రెస్‌ని గెలిపిస్తారా సోషల్ మీడియాలో మీకు జనాలు క్వశ్చన్ అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉంది.' అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు.


'మీరు భారీ ఓట్లతోని ఓడిపోతే కేంద్ర అధికారులకు మల్లా మీ ముఖం ఎట్లా చూపెడతారు.. కొద్దిగా ఆలోచన చేసినారా మా సారు. ప్రతి ఒక్క పార్లమెంట్లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క డివిజన్లో మేలు చేసే అలవాటు ఉన్నది. ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటికి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా.' అంటూ.. రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. అయితే గతంలో కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

Government Policy: బాబోయ్‌ ఇథనాల్‌

TCS CEO Kriti Vasudevan: కొత్తగా హెచ్‌-1బీ ఉద్యోగులను నియమించం టీసీఎస్‌ సీఈవో కృతివాసన్‌ వెల్లడి

Updated Date - Oct 14 , 2025 | 10:57 AM