Talasani On Bonalu Festival: నిర్బంధంలో కాదు.. స్వేచ్ఛ వాతావరణంలో పండుగలు జరగాలి: తలసాని
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:02 AM
Talasani On Bonalu Festival: పండుగలు, జాతరలు అనేది నిర్బంధనంలో జరగవద్దని.. స్వేచ్ఛ వాతావరణంలో జరగాలని తలసాని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. నాలుగు గంటల పది నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

హైదరాబాద్, జులై 14: ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఎంతో మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Former Minster Talasani Srinivas Yadav) అన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. సాయంత్రం పలారం బండి ఊరేగింపు ఉంటుందన్నారు. పండుగ అనేది నిర్బంధాల మధ్యన జరిగితే భక్తులు ఇబ్బంది పడతారని అభిప్రాయపడ్డారు. అనేక సంవత్సరాల నుంచి కొందరి కోఆర్డినేషన్‌తో పండుగను నిర్వహించుకున్నామని గుర్తుచేశారు. 2014లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పండుగగా బోనాల ఏర్పాట్లు చేశామన్నారు. సహకరించినటువంటి స్థానిక ప్రజలకు, ఆర్గనైజేషన్లకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు.
దేవాలయంలో పనిచేసే వారికి, ఆర్గనైజేషన్ అందరికీ అభినందనలు తెలిపారు. పండుగలు, జాతరలు అనేది నిర్బంధనంలో జరగవద్దని.. స్వేచ్ఛ వాతావరణంలో జరగాలని చెప్పుకొచ్చారు. నాలుగు గంటల పది నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. గతంలో ఎన్టీ రామారావు మూడు గంటలకు వచ్చేవారని.. మొదటి పూజ మూడు గంటలకే జరిగేదని నిన్న మాత్రం ఆలస్యంగా జరిగిందన్నారు. అందరి సహకారంతో పండుగను జయప్రదం చేయాలన్నారు. పలారం బండి ఊరేగింపులో చాలా ఆటంకాలు జరుగుతున్నాయని.. అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
కాగా.. నిన్న (ఆదివారం) సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో బోనాలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలు పండుగ తర్వాతి రోజు అంటే ఈరోజు ఆలయంలో రంగం కార్యక్రమం కూడా వైభవంగా జరిగింది. ఈ సారి కూడా వర్షాలు బాగా కురుస్తాయని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.తనకు సక్రమంగా పూజలు చేయాలని.. లేకపోతే అల్లకల్లోలం సృష్టిస్తానంటూ అమ్మవారు హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి
వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..
Read Latest Telangana News And Telugu News