Fire Accident: తెలంగాణలో మరో అగ్నిప్రమాదం.. ఏమైందంటే..
ABN , Publish Date - Jul 14 , 2025 | 07:29 AM
మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జలీల్‌గూడలోని సాయి గణేష్ నగర్ కాలనీలో వెల్డింగ్ దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జలీల్‌గూడలోని సాయి గణేష్ నగర్ కాలనీలో వెల్డింగ్ దుకాణంలో ఇవాళ(సోమవారం, జులై 14)న అగ్నిప్రమాదం (Fire Accident At Meerpet) జరిగింది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మీర్‌పేటలోని కార్ మెకానిక్ షాప్, కార్ డెంటింగ్ షాప్‌తో సహా పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక అధికారులకు, పోలసులకు సమాచారం అందించారు.
సమాచారం అందగానే సంఘటన స్థలానికి అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను మూడు ఫైర్ ఇంజన్లతో ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫైర్ సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అగ్నిప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి షాపులోని పరికరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలన అంటే శంకుస్థాపనలే కాదు : కేటీఆర్
రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్
Read Latest Telangana News And Telugu News