Share News

Jagadish Reddy: కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో సాగునీరు

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:31 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ చేతకాని రేవంత్‌ సర్కార్‌.. రైతాంగానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నది. ప్రాజెక్టు నిర్వహణను కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి చూపిస్తారు.

Jagadish Reddy: కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో సాగునీరు

  • మాజీ మంత్రిజగదీశ్‌ రెడ్డి

గోదావరిఖని, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ చేతకాని రేవంత్‌ సర్కార్‌.. రైతాంగానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నది. ప్రాజెక్టు నిర్వహణను కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి చూపిస్తారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగి సుభిక్షంగా ఉంటే.. రేవంత్‌ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోంది’’ అని మాజీ మంత్రి జగద్వీర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated Date - Jul 14 , 2025 | 05:31 AM