Share News

Supreme Court: నీట్‌లో స్థానిక కోటాపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jul 23 , 2025 | 02:02 PM

తెలంగాణ స్థానికత వివాదానికి పరిష్కారం వెతకాలని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణని ఆగస్టు 5వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Supreme Court: నీట్‌లో స్థానిక కోటాపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court

హైదరాబాద్: తెలంగాణ స్థానికత వివాదానికి పరిష్కారం వెతకాలని.. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణని ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. నీట్ పరీక్ష రాయడానికి ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే స్థానికత వర్తిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు చెల్లవంటూ తెలంగాణ హైకోర్టు గతేడాది తీర్పు వెల్లడించింది.


హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గతేడాది మాత్రం పిటీషనర్లకు మినహాయింపు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ ఏడాది తమకు కూడా స్థానికత నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు విద్యార్థులు. తెలంగాణలో పుట్టి పదో తరగతి వరకు చదివినా స్థానిక కోటా దక్కడం లేదని పిటీషన్‌లో పేర్కొన్నారు విద్యార్థులు. 11, 12వ తరగతులు చదవని కారణంగా నీట్‌లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నామని తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టుకి వివరించారు. ఈ మేరకు సమస్యకు పరిష్కారం చూపాలని, విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం సూచిస్తూ విచారణ వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2025 | 03:49 PM