Share News

BC JAC: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో ర్యాలీ

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:50 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీసీ వాదంతో గెలిచిందనే విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోవద్దని బీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. రేపు(సోమవారం) 17వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌‌లో ఢిల్లీకి వెళ్లే అఖిల పక్షం తేదీని ప్రకటించాలని కోరారు బీసీ జేఏసీ నేతలు.

BC JAC: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో ర్యాలీ
BC JAC

హైదరాబాద్, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): బీసీ జేఏసీ (BC JAC) ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ (Run for Social Justice) పేరుతో ఇవాళ(ఆదివారం) భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బషీర్‌బాగ్ నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ వరకు జరిగింది. ఈ ర్యాలీలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ, తదితరులు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు (BC Reservations) పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.


బీసీ రిజర్వేషన్లని పెంచకుండా తొందరపడి స్థానిక ఏన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్‌కు బీసీలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తక్షణమే అఖిలపక్షంతో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చించాలని సూచించారు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అవుతోందని వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ పరంగా స్థానిక ఏన్నికలు నిర్వహిస్తే తాము ఒప్పుకోమని.. చట్టబద్ధమైన రిజర్వేషన్లు బీసీలకు ఇవాల్సిందేనని స్పష్టం చేశారు.


జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీసీ వాదంతో కాంగ్రెస్ గెలిచిందనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మర్చిపోవద్దని పేర్కొన్నారు. రేపు(సోమవారం) 17వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌‌ సమావేశంలో ఢిల్లీకి వెళ్లే అఖిలపక్షం తేదీని ప్రకటించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలలో డిపాజిట్ గల్లంతైందని విమర్శించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపాలని.. లేకపోతే డిసెంబరు మొదటి వారంలో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లుని కేంద్రం ఆమోదించకపోతే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి జూబ్లీహిల్స్ ఎన్నికలలో పట్టిన గతే పడుతుందని బీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..

షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2025 | 12:59 PM