Share News

Private Institutions: ప్రభుత్వం సహకరించకున్నా.. విద్యా సంస్థలు నడుపుతున్నాం..

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:02 PM

గత ప్రభుత్వం చేసిన బకాయిల వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రైవేటు విద్యా సంస్థల సంఘం ఛైర్మన్ రమేష్ ఆరోపించారు. ప్రభుత్వం ఏం చెప్పినా.. ఒక ఒబిడియెంట్ విద్యార్థి లాగా వింటున్నానని తెలిపారు.

Private Institutions: ప్రభుత్వం సహకరించకున్నా.. విద్యా సంస్థలు నడుపుతున్నాం..

హైదరాబాద్: తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు వివరణ ఇస్తానని ప్రైవేటు విద్యా సంస్థల సంఘం ఛైర్మన్ రమేష్ అన్నారు. ఇవాళ(శనివారం) ఆయన ఏబీఎన్‌తో మాట్లాడారు. తాను సీఎం రేవంత్‌కి ఫ్యాన్ అని, రేవంత్ రెడ్డిని హీరో లాగా చూస్తానని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తే.. రేవంత్ సీఎం అయ్యాక సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. కొంత కమ్యూనికేషన్‌ గ్యాప్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు సహకరిస్తోందని స్పష్టం చేశారు.


గత ప్రభుత్వం చేసిన బకాయిల వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రమేష్ ఆరోపించారు. ప్రభుత్వం ఏం చెప్పినా.. ఒక ఒబిడియెంట్ విద్యార్థి లాగా వింటున్నానని తెలిపారు. విద్య వ్యాపారం కాదు సేవ అని స్పష్టం చేశారు. 97.23 శాతం ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. డొనేషన్లు తీసుకోమని ప్రభుత్వమే అధికారం ఇస్తోందని, ప్రభుత్వంలోనే లోపం ఉందన్నారు. వాటిని కలిసి సరిదిద్దుదామని తాము ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు.


ఈ మొత్తం వ్యవహరంలో ఫ్రాడ్ చేస్తున్నది తహసీల్దార్లని ఛైర్మన్ రమేష్ ఆరోపించారు. తహసీల్దార్లు దొంగ ఇన్‌క‌మ్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఐదేండ్లుగా ప్రభుత్వం డబ్బు ఇవ్వకపోయినా.. విద్యా సంస్థలను నడుపుతున్నామని తెలిపారు. తమ వెనక ఏ రాజకీయ శక్తులు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం డబ్బు ఇవ్వకుండా.. ట్రస్ట్ బ్యాంక్ లాంటిది ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ లక్ష కోట్ల టర్నోవర్ చేస్తున్నాయని విద్యా సంస్థల సంఘం ఛైర్మన్ రమేష్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం

హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం

Updated Date - Nov 08 , 2025 | 03:33 PM