SIT Investigation: సిట్ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యాప్‌పైనే విచారణ
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:39 AM
SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు మరోసారి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఒక్క రోజే 650 ఫోన్ల ట్యాపింగ్‌పై ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్, జూన్ 21: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao) సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రణీత్ రావు స్టేట్‌మెంట్‌ను సిట్ బృందం రికార్డు చేస్తోంది. 2023 నవంబర్ 15న 650 ఫోన్ల ట్యాపింగ్‌పై మాజీ డీఎస్పీని సిట్ బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఇండియాకు వచ్చిన తర్వాత వరుసగా మూడో సారి ప్రణీత్ రావు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు.
2023 నవంబర్ 15న ఒకేరోజు 650 ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని... మావోయిస్టుల నేతలతో వీరికి సంబంధాలు ఉన్నాయంటూ రాజకీయ నేతల నెంబర్లను పంపించి రివ్యూ కమిటీ ద్వారా గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఫోన్‌లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో వాటికి సంబంధించి ప్రభాకర్ రావును కూడా దాదాపు మూడు సార్లు విచారించారు సిట్ అధికారులు. అలాగే ఈరోజు (శనివారం) ప్రణీత్ రావును కూడా విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. మరోవైపు ప్రణీత్ రావును వ్యక్తిగతమైన బ్యాంకు లావాదేవీలతో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు చెప్పారు. దీంతో ఆయన కొన్ని డాక్యుమెంట్లతో సిట్ ముందుకు వచ్చారు. ప్రణీత్ రావును కూడా ఈరోజు రాత్రి వరకు విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.
ఈ కేసులో ఎవరిని విచారించినా ఒకరిపై ఒకరు చెప్పుకోవడాన్ని సిట్ అధికారులు గుర్తించారు. అయితే అధికారుల మధ్యే ఈ వ్యవహారం నడుస్తోంది తప్ప.. పై అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రాజకీయ నేతలు ఎవరు అనేది అంతుచిక్కిన ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో ఈరోజు ప్రణీత్ రావు విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి మరి కొంతమందికి నోటీసులు పంపి విచారణ జరుపునున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి
భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్
గిన్నీస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం..
Read latest Telangana News And Telugu News