Share News

Hydderabadd: బల్కంపేట ఎల్లమ్మకు కోటి విరాళం

ABN , Publish Date - Jun 21 , 2025 | 10:56 AM

ల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ కోటి రూపాయలను విరాళంగా అందజేసినట్లు ఆలయ ఈవో మహేందర్‌ గౌడ్‌ తెలిపారు.

Hydderabadd: బల్కంపేట ఎల్లమ్మకు కోటి విరాళం

- బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన నీతా అంబానీ

- వచ్చే వడ్డీతో భక్తులకు నిత్యాన్నదానం

- ఆలయం ఈవో మహేందర్‌గౌడ్‌

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ(Balkampet Yellamma) దేవస్థానానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) కోటి రూపాయలను విరాళంగా అందజేసినట్లు ఆలయ ఈవో మహేందర్‌ గౌడ్‌ తెలిపారు. ఈ మొత్తాన్ని ఆమె బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారని, దీనిపై వచ్చిన వడ్డీతో ఆలయానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.


ఈ ఏడాది ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌(Hydderabadd)లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్‌, సోదరి మమతా దలాల్‌ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే. ఆ సమయంలో దేవాలయం అభివృద్ధికి సహకరించాలని కోరగా ఆమె సానుకూలంగా స్పందించారని ఈవో తెలిపారు. ఈ నెల 13న అమ్మవారికి రూ. కోటి విరాళంగా ఇస్తూ సమాచారం అందించారని,


city2.2.jpg

బ్యాంకులో దేవస్థానం అకౌంట్‌లో ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 2012 నుంచి నీతా అంబానీ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటూ వస్తున్నట్లు ఈవో వివరించారు. ఇదిలా ఉండగా, అమ్మవారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయం ఈవో మహేందర్‌గౌడ్‌ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నీటి రక్షణకు కుట్టి రోబోలు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 21 , 2025 | 10:56 AM