SIT Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:27 AM
SIT Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరుగా సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు తరలి వస్తున్నారు.

హైదరాబాద్, జూన్ 27: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Former SIB Chief Prabhakar Rao), మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుల (Former DSP Praneeth Rao) విచారణలో ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను సేకరించారు సిట్ అధికారులు. ఇప్పటికే వేల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ బృందం గుర్తించింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్‌మెంట్‌లను సిట్ బృందం రికార్డ్ చేస్తోంది.
ఇప్పటి వరకు 257 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది సిట్. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది నాయకుల ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసింది. ఈరోజు మరి కొంతమంది సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయనున్నారు. 4200లకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. రాజకీయనాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ తేల్చింది. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిని వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని సమాచారం ఇచ్చింది సిట్ బృందం. ఈ క్రమంలో ఈరోజు (శుక్రవారం) సిట్ ముందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రానున్నట్లు తెలుస్తోంది.
కాగా.. గత ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయ్యింది. దాదాపు ఏడాదిగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావు అమెరికాలో ఉండటంతో ఈ కేసు విచారణ ఆలస్యమైంది. ఇక ఎట్టకేలకు ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావడంతో ఈ కేసులో విచారణను వేగవంతం చేసి సిట్. దాదాపు నెల రోజులుగా ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్ బృందానికి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 4200లకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అనేక మంది సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సిట్ అధికారులు.. మరికొంత మంది నుంచి కూడా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
గోల్కొండలో ఆషాఢ మాస బోనాల సందడి షురూ
మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక
Read Latest Telangana News And Telugu News