Share News

Electricity: ఈ ఏరియాల్లో మధ్నాహ్నం 1గంట వరకు కరెంట్ కట్..

ABN , Publish Date - Jun 27 , 2025 | 07:01 AM

ఆజామాబాద్‌ డివిజన్‌, హైదరాబాద్‌ సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్‌ తెలిపారు.

Electricity: ఈ ఏరియాల్లో మధ్నాహ్నం 1గంట వరకు కరెంట్ కట్..

- నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: ఆజామాబాద్‌(Azamabad) డివిజన్‌, హైదరాబాద్‌ సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్‌ తెలిపారు. సీఈ కాలనీ, నిజాం కాలేజ్‌, జాఫర్‌ అలీ బాగ్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 నుంచి మధ్నాహ్నం 1గంట వరకు, అయ్యప్ప ఆలయం, విజయఆస్పత్రి, బొగ్గులకుంట, కామినేని పరిధిలో మధ్నాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

రాయదుర్గం: రాయదుర్గం(Rayadurgam) 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాయదుర్గం, మధురానగర్‌, రాయదుర్గం పీఎస్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడుతుంది. ఎస్కీ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎస్కీ, ఎస్కీస్టాప్‌ కళాశాల ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడుతుంది.


city1.jpg

హెచ్‌ఎంటీహిల్స్‌లో...

హైదర్‌నగర్‌: హెచ్‌ఎంటీహిల్స్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా ఉదయం 10నుంచి 1గంట వరకు అడ్డగుట్ట రోడ్డునెంబర్‌ 1,2, సమతానగర్‌లో విద్యుత్‌ ఉండదు. అదేవిధంగా శ్రీనివాసం ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు జయనగర్‌, మాధవినగర్‌, భాగ్యనగర్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 27 , 2025 | 07:04 AM