Share News

GHMC: మరోసారి తెరపైకి.. బెగ్గర్‌ ఫ్రీ సిటీ

ABN , Publish Date - Jun 27 , 2025 | 08:38 AM

యాచక రహిత నగరం అంశాన్ని జీహెచ్‌ఎంసీ మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. గ్రేటర్‌లోని ప్రధాన కూడళ్ల వద్ద పౌరులకు ఇబ్బందులు కలిగిస్తోన్న యాచకులను గుర్తించి షెల్టర్‌ హోంలకు తరలించడం లేదా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించినట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో సంస్థ పేర్కొంది.

GHMC: మరోసారి తెరపైకి.. బెగ్గర్‌ ఫ్రీ సిటీ

  • గ్రేటర్‌లో స్పెషల్‌ డ్రైవ్‌కు జీహెచ్‌ఎంసీ శ్రీకారం

  • 221 మంది గుర్తింపు..

  • షెల్టర్‌ హోంకు 19 మంది

హైదరాబాద్‌ సిటీ: యాచక రహిత నగరం అంశాన్ని జీహెచ్‌ఎంసీ(GHMC) మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. గ్రేటర్‌లోని ప్రధాన కూడళ్ల వద్ద పౌరులకు ఇబ్బందులు కలిగిస్తోన్న యాచకులను గుర్తించి షెల్టర్‌ హోంలకు తరలించడం లేదా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించినట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో సంస్థ పేర్కొంది. గతంలోనూ పలుమార్లు బెగ్గర్‌ ఫ్రీ సిటీ కార్యక్రమాలు చేపట్టారు.


పోలీసులతో కలిసి చేపట్టిన డ్రైవ్‌లో వందల సంఖ్యలో యాచకులను గుర్తించి నగర శివారులోని ఓ హోంకు తరలించినట్టు ప్రకటించారు. కానీ నగరంలో అప్పటి పరిస్థితే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి యాచకులను నగరం నుంచి తరలించే పనికి శ్రీకారం చుట్టారు. బషీర్‌బాగ్‌, సచివాలయం(Basheerbagh, Secretariat), నాంపల్లి, బేగంబజార్‌ తదితర ప్రాంతాల్లోని జంక్షన్ల వద్ద, ఫుట్‌పాత్‌లపై ఉండే యాచకులను గుర్తించి జీహెచ్‌ఎంసీ షెల్టర్‌ హోంలకు తరలిస్తున్నారు. కొందరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి సొంత ఊరు, ఇళ్లకు పంపిస్తున్నారు.


city4.2.jpg

పోలీసుల సహకారంతో అర్బన్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌(యూసీడీ) విభాగం ఆధ్వర్యంలో రెండు, మూడు రోజులుగా 221 మంది యాచకులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం 19 మందిని జీహెచ్‌ఎంసీ షెల్టర్‌ హోంలకు, మిగతా వారిని కుటుంబ సభ్యుల వద్దకు పంపించినట్టు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 27 , 2025 | 08:38 AM