Share News

Hyderabad: రూ.5 భోజన కేంద్రాల్లో అల్పాహారం కూడా..

ABN , Publish Date - Jun 27 , 2025 | 08:02 AM

గ్రేటర్‌లోని రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ఇందిర క్యాంటీన్లుగా పేరు పెట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అలాగే కేంద్రాల్లో భోజనంతో పాటు అల్పాహారం అందించాలని భావిస్తున్నారు.

Hyderabad: రూ.5 భోజన కేంద్రాల్లో అల్పాహారం కూడా..

- ఇందిరమ్మ క్యాంటిన్లుగా పేరు మార్పు

- స్టాండింగ్‌ కమిటీలో ఆమోదం

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లోని రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ఇందిర క్యాంటీన్లుగా పేరు పెట్టాలని జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్ణయించింది. అలాగే కేంద్రాల్లో భోజనంతో పాటు అల్పాహారం అందించాలని భావిస్తున్నారు. ఈ మేరకు గురువారం మేయర్‌ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi) అధ్యక్షతన సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు.


ఎజెండాలోని 22 అంశాలతోపాటు టేబుల్‌ ఐటమ్స్‌గా 10 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.11 ప్రాంతాల్లో సీటింగ్‌ సదుపాయం పునరుద్ధరించడంతో పాటు, మరో 40చోట్ల పౌరులు కూర్చుని తినేలా సౌకర్యాలు కల్పించనున్నారు. సమావేశంలో కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, సభ్యులు పాల్గొన్నారు.


city3.2.jpg

ముఖ్యమైన అంశాలు

- జీహెచ్‌ఎంసీలోని నాలాలు, వరద నీటి కాలువల గుర్తింపునకు సాంకేతిక సర్వే చేపట్టాలి.

- రెండు పడకల ఇళ్ల సముదాయాల్లో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల (ఎస్‌టీపీ) నిర్మాణం, నిర్వహణ బాధ్యతల నుంచి ఎంపికైన సంస్థ తప్పుకోవడంతో అంసపూర్తిగా ఉన్న పనులను జై శ్రీరామ్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ సంస్థకు టెండర్లు పిలవకుండా అప్పగించాలి.


- మల్కాజ్‌గిరి సర్కిల్‌లో ఏర్పాటుచేసే నూతన రైల్వే స్టేషన్‌కు రాధాకృష్ణానగర్‌ స్టేషన్‌గా పేరు పెట్టినందున.. ఇంగ్లీష్‌, హిందీ, స్థానిక భాషలలో అక్షరాల ధ్రువీకరణకు ప్రభుత్వానికి పంపాలి.

- గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్‌ సెకండ్‌ లెవల్‌ వంతెనకు దివంగత పి.జనార్దన్‌రెడ్డి పేరు పెట్టాలి.

- 156 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని హైడ్రా నుంచి జీహెచ్‌ఎంసీకి తిరిగి తీసుకొని వారిని పార్కుల వద్ద సెక్యూరిటీ గార్డులుగా నియమించాలి. వీరి సేవలు ఏడాది పొడిగిస్తూ నిర్ణయం.


ఈ వార్తలు కూడా చదవండి.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 27 , 2025 | 08:02 AM