TG News: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Apr 28 , 2025 | 09:57 AM
Road Accident: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది అతివేగంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రహదారులు మృత్యుదారులుగా మారుతూ వాహనదారుల ప్రాణాలను కబలిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల గురించి రవాణా శాఖ అధికారులు ఎంతగానో అవగాహన కల్పిస్తున్న కొంతమంది మాత్రం ఓవర్ స్పీడ్‌తో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మియాపూర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 636 వద్ద నిన్న (ఆదివారం) అర్ధరాత్రి ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. కేపీహెచ్‌బీ నుంచి మియాపూర్‌కు ద్విచక్ర వాహనంపై అన్నదమ్ములు హైదర్ షరీఫ్(68),రెహమాన్ షరీఫ్(65) బయలుదేరారు.
బైక్ స్కిడ్ అవడంతో అదుపు తప్పి అన్నదమ్ములు కిందపడ్డారు. ఆ సమయంలోనే వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు వారి మీద నుంచి దూసుకెళ్లడంతో హైదర్ షరీఫ్ మృతిచెందగా రెహమాన్ షరీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెహమాన్ షరీఫ్‌ను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో హైదర్ షరీఫ్ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ
Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి
Kaleshwaram: బినామీల గుట్టు విప్పని హరిరామ్!
Read Latest Telangana News And Telugu News