Share News

Panchayat Elections:పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..

ABN , Publish Date - Nov 27 , 2025 | 09:10 AM

తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమైంది. ఇవాళ తొలి దశ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 Panchayat Elections:పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..
Panchayat Elections Nominations

హైదరాబాద్, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల (Panchayat Elections Nominations) పర్వం ఇవాళ(గురువారం) నుంచి ప్రారంభమైంది. ఈరోజు తొలి దశ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. నేటి నుంచి ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తునట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఈనెల 30న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 11వ తేదీన తొలి విడతలో 189 మండలాలు, 37440 వార్డులు, 4,236 గ్రామాల్లో ఎన్నికలు జరగుతాయని ప్రకటించారు.


ఆర్వో , ఏఆర్వోలుగా గెజిట్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు ఎన్నికల అధికారులు. మూడు నాలుగు గ్రామాలను కలిపి క్లస్టర్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పోటీ చేసే అభ్యర్థులు ఆయా కేంద్రాల్లో నామినేషన్లు వేసేందుకు ఛాన్స్ కల్పించారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులుగా ఆర్వోలు, ఆర్వోలు వ్యవహారిస్తున్నారు. అభ్యర్థుల నగదు డిపాజిట్ కూడా వారికే అప్పగించారు.


నామినేషన్‌తో పాటు ఫొటో, క్యాస్ట్ సర్టిఫికెట్, నో డ్యూస్ , బర్త్ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్ నంబర్ జత చేయాలని ఎన్నికల అధికారులు సూచించారు. అభ్యర్థి అఫిడవిట్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు సాక్షి సంతకం పెట్టాలని కోరారు. ఎస్సీ , ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1000లు... ఇతరులు రూ. 2000 డిపాజిట్ చేయాలని సూచించారు. వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీలకు రూ. 250... ఇతరులు రూ. 500 చెల్లించాలని ఆదేశించారు.


ఉమ్మడి వరంగల్ జిల్లాలో..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 555 పంచాయతీలు, 4952 వార్డు స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరగుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. వరంగల్ 91 పంచాయతీలు, 800ల వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లా 69 పంచాయతీలు , 658 వార్డు స్థానాలు, మహబూబాబాద్ జిల్లా 155 పంచాయతీలు, 1338 వార్డు స్థానాలు, జనగామ జిల్లా 110 పంచాయతీలు,1024 వార్డు స్థానాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా 82 పంచాయతీలు, 712 వార్డు స్థానాలు, ములుగు జిల్లా 48 పంచాయతీలు, 420 వార్డు స్థానాలకు గానూ ఎన్నికలు జరగుతున్నాయి.


ఉమ్మడి నల్గొండ జిల్లాలో..

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మొదటి విడతలో 630 గ్రామ పంచాయతీలు, 5,598 వార్డులకు నామినేషన్స్ స్వీకరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో నల్గొండ, చండూరు రెవెన్యూ డివిజన్లలోని 318 గ్రామ పంచాయతీలు, 2,870 వార్డులకు నామినేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, తుంగతుర్తి రెవెన్యూ డివిజన్లలోని 159 గ్రామ పంచాయతీలు, 1,442 వార్డులకు నామినేషన్లు జరుగుతోంది. యాదాద్రి - భువనగిరి జిల్లాలో భువనగిరి రెవెన్యూ డివిజన్‌లోని 153 గ్రామ పంచాయతీలు, 1,286 వార్డులకు నామినేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్స్ స్వీకరిస్తున్నారు.


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో...

నేటి నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఆదిలాబాద్ జిల్లాలో 166, మంచిర్యాల జిల్లాలో 90, నిర్మల్ జిల్లాలో 136, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 114 సర్పంచ్, వార్డు స్థానాలకు తొలివిడత ఎన్నికలు జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 27 , 2025 | 11:12 AM