Share News

Teenmar Mallanna: కవితపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నా తీన్మార్ మల్లన్న

ABN , Publish Date - Jul 14 , 2025 | 02:08 PM

బీసీల ఉద్యమాన్ని ఆపాలనే కవిత కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. కవిత, ఆమె ప్రేరేపిత గుండాలు చేసిన అరాచకంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.

Teenmar Mallanna: కవితపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నా తీన్మార్ మల్లన్న
MLC Teenmar Mallanna

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (BRS MLC Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) సమర్థించుకున్నారు. 2017 తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఒక పుస్తకం ప్రచురించిందని.. ఆ పుస్తకానికి ముందుమాట రాసింది కేసీఆరేనని గుర్తుచేశారు. ఆ పుస్తకంలో ‘మంచం పొత్తు - కంచం పొత్తు’ అని ఉంటుందని చెప్పుకొచ్చారు . తెలుగు వ్యాకరణ భాషపై తనకు పట్టు ఉందని ఉద్ఘాటించారు తీన్మార్ మల్లన్న.


ఏ పదాలు వాడాలి, ఏ పదం వాడకూడదనేది తనకు తెలుసునని నొక్కిచెప్పారు. ‘కంచం పొత్తు - మంచం పొత్తు’ అంటే బీసీల భాషలో వియ్యం పొత్తు అనే అర్థం వస్తోందని గుర్తుచేశారు. వాళ్ల భాషలో ‘మంచం పొత్తు’ అంటే ఏంటో తనకు తెలియదని విమర్శించారు. ఇవాళ(సోమవారం) శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని తీన్మార్ మల్లన్న కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల ఉద్యమాన్ని ఆపాలనే కవిత కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు తీన్మార్ మల్లన్న.


దొరసానికి బీసీల భాష ఏం తెలుసని కవితని పరోక్షంగా విమర్శించారు. కవిత, ఆమె ప్రేరేపిత గుండాలు చేసిన అరాచకంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కవితపై విచారణ చేస్తామని గుత్తా సుఖేందర్‌రెడ్డి తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కవిత బీసీ వాదంపై దాడి చేస్తోందని ఆక్షేపించారు. కవితకి అధికారం పోయినా అహంకారం తగ్గడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కవిత చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆర్ కాదా అని తీన్మార్ మల్లన్న ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ చేసిన తప్పులను మాపై రుద్దుతున్నారు.. మల్లు భట్టి విక్రమార్క ఫైర్

కేసీఆర్‌తో హరీష్‌రావు కేటీఆర్ కీలక భేటీ.. ఎందుకంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 03:07 PM