Minister Konda Surekha: నా సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ హై కమాండ్ హామీ ఇచ్చింది: మంత్రి కొండా సురేఖ
ABN , Publish Date - Oct 16 , 2025 | 07:44 PM
మీనాక్షి నటరాజన్‌ని ఇవాళ తాను కలిశానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తాను చెప్పాల్సింది చెప్పానని అన్నారు. జరుగుతున్న విషయాలను కాంగ్రెస్ పెద్దలతో చెప్పానని కొండా సురేఖ పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)లతో మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి కొండా సురేఖ.
మీనాక్షి నటరాజన్‌ని తాను ఇవాళ కలిశానని చెప్పుకొచ్చారు మంత్రి సురేఖ. తాను చెప్పాల్సింది చెప్పానని తెలిపారు. జరుగుతున్న విషయాల గురించి కాంగ్రెస్ పెద్దలకు వివరించినట్లు చెప్పుకొచ్చారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా సరే పాటిస్తానని స్పష్టం చేశారు. తన ఆలోచనలు, ఇబ్బందులని కాంగ్రెస్ పెద్దలకు చెప్పానని వివరించారు మంత్రి కొండా సురేఖ.
పార్టీ పెద్దలు కూర్చొని మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. జరిగిన విషయాలన్నింటినీ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లానని.. భారం అంతా పార్టీ పెద్దలపైనే ఉంచానని స్పష్టం చేశారు. విచారణ చేసి త్వరలో నిర్ణయం చెబుతామని పార్టీ పెద్దలు చెప్పారని పేర్కొన్నారు. పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా.. వారు ఇచ్చే ఆదేశాలను పాటిస్తానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజాస్వామ్యబద్ధంగా డీసీసీ అధ్యక్ష ఎన్నిక: కొండా మురళి
తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకి ఆమోదం
Read Latest Telangana News And Telugu News