Share News

KCR: అసెంబ్లీకి కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ ఇదేనా..

ABN , Publish Date - Mar 11 , 2025 | 08:25 AM

KCR: తెలంగాణ అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలపై అసెంబ్లీలో ఎండగడతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈరోజు జరుగుతున్న సమావేశంలో నేతలకు కేసీఆర్ వ్యూహారచన చేయనున్నారు.

KCR: అసెంబ్లీకి కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ ఇదేనా..
KCR BRSLP meeting

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఇవాళ(మంగళవారం) జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటలకు తెలంగాణ భవన్ వేదికగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపు(బుధవారం) నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.


ALSO READ: MLC Kavitha: మహిళలకు ఎమ్మెల్సీ కవిత సూచన.. ఆమె ఏమన్నారంటే..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌పై ఎమ్మెల్యేలకు కేసీఆర్ అవగాహన కల్పించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. రైతాంగ సమస్యలు, ఏపీతో నీటి పంపకాలపై సభలో కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై సభలో ప్రశ్నలు లేవనెత్తుతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. సభకు కేసీఆర్ హాజరవుతారని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad: టీడీఆర్‌ స్కామ్‌కు రేవంత్‌ కుట్ర

Harish Rao: సీఎం రేవంత్‌ రాజీనామా చేయాలి

Uttam : చేతికొచ్చిన పంటల రక్షణే ప్రభుత్వ కర్తవ్యం

Read Latest Telangana News and Telugu News

Updated Date - Mar 11 , 2025 | 09:00 AM