Kavitha Supports BC Bandh: బీసీ బంద్‌కు కవిత మద్దతు
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:15 PM
బీసీల బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు కవిత.
హైదరాబాద్, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): బంద్ ఫర్ జస్టిస్ పేరుతో రేపు (అక్టోబర్ 18)వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో బీసీల బంద్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మద్దతు తెలపాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) లేఖ రాశారు. అయితే, ఆర్. కృష్ణయ్య లేఖపై స్పందించారు కవిత. బీసీ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు కవిత.
తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొంటోందని... అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్లు భావించాలా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో బిల్లులు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడకుండా బీసీ రిజర్వేషన్లపై ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ తామే ముందుండి బంద్ చేయిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని కవిత విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బంద్‌కు ప్రధాన కారణం బీజేపీనే: డిప్యూటీ సీఎం భట్టి
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
Read Latest Telangana News And Telugu News