Home » R Krishnaiah
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.4 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతూ ఎంపీ ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. కళాశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, బీసీల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించకపోతే ప్రజా భవన్‌ను హాస్టళ్లుగా మారుస్తామంటూ ఆయన అన్నారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు బీజేపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేస్తుందని, త్వరలోనే ప్రభుత్వం జీవో తెస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.
విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు వెంటనే జీవోలు జారీ చేయాలని 26 బీసీ కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడమే బీసీల లక్ష్యమని పలువురు వక్తలు అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను విక్రయిస్తే అడ్డుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. అలాగే ఆ భూములను కొనుగోలు చేస్తే అందులో అడుగుపెట్టనీయబోమన్నారు.
ఈ నెల 26న ఢిల్లీ, అశోక రోడ్‌లోని తెలంగాణ భవన్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆవిష్కరించి మాట్లాడారు.
ప్రధాని మోదీ ఒరిజినల్ బీసీ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మోదీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య తప్పని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ బీసీ కాదని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.