Share News

R Krishnaiah: రాజ్యాంగ భద్రత కల్పించాకే ‘స్థానికం’ నిర్వహించాలి..

ABN , Publish Date - Nov 14 , 2025 | 09:59 AM

బీసీలకు కల్పించిన 42శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ బద్ధంగా అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ చైర్మన్‌, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. పార్టీల పరంగా 42శాతం రిజర్వేషన్లు బీసీలకు అవసరం లేదని చట్టబద్ధంగానే అమలు చేయాలని ఆయన కోరారు.

R Krishnaiah: రాజ్యాంగ భద్రత కల్పించాకే ‘స్థానికం’ నిర్వహించాలి..

-బీసీ జేఏసీ చైర్మన్‌, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

హైదరాబాద్: బీసీలకు కల్పించిన 42శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ బద్ధంగా అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ చైర్మన్‌, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. పార్టీల పరంగా 42శాతం రిజర్వేషన్లు బీసీలకు అవసరం లేదని చట్టబద్ధంగానే అమలు చేయాలని ఆయన కోరారు. రిజర్వేషన్లను అడ్డుకుంటే బీసీ వ్యతిరేకులకు తగిన గుణ పాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ నీలా వెంకటేష్‌ ఆధ్వర్యంలో గురువారం బర్కత్‌పుర అరుణా స్టూడియో నుంచి విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీ సంఘాల నేతలు సి.రాజేందర్‌, టి.రాజ్‌కుమార్‌, పగిళ్ల సతీష్‌, శివయాదవ్‌, వంశీకృష్ణ, బానాల అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.


city7.2.jpg

16న న్యాయసాధన దీక్ష

42శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 16న ఇందిరాపార్కు వద్ద న్యాయసాధన దీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ చైర్మన్‌, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య పేర్కొన్నారు. గురువారం కాచిగూడ(Kachiguda)లో 14 బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ ఈనెల 20న జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు అన్ని పట్టణాలలో నిరాహార దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


అలాగే, జనవరిలో పరేడ్‌గ్రౌండ్‌లో 5లక్షల మందితో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ నీలా వెంకటేష్‌, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2025 | 09:59 AM