Kaleshwaram Commission Report: కేసీఆర్, హరీష్‌రావు, ఈటలపై క్రిమినల్ చర్యలకు సూచన
ABN , Publish Date - Aug 03 , 2025 | 08:20 PM
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై అధికారుల కమిటీ ఆదివారం అధ్యయనం చేసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు అధికారుల దృష్టికి వచ్చాయి. సమగ్ర వివరాలతో నివేదికను కేబినెట్ ముందు అధికారుల కమిటీ ఉంచనున్నారు.

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై అధికారుల కమిటీ ఇవాళ(ఆదివారం) అధ్యయనం చేసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు అధికారుల దృష్టికి వచ్చాయి. సమగ్ర వివరాలతో నివేదికను కేబినెట్ ముందు అధికారుల కమిటీ ఉంచనున్నారు. అధికారుల కమిటీ నివేదికపై రేపు(సోమవారం) తెలంగాణ కేబినెట్‌లో చర్చించనున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్ పాత్రపై పీసీ ఘోష్ కమిషన్ ఫోకస్ చేశారు. కేసీఆర్ నిర్ణయాలకు గుడ్డిగా ఆమోదం తెలిపినట్లు కమిషన్ గుర్తించింది. సమగ్ర విశ్లేషణతో నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు అధికారుల కమిటీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్‌రావు, ఈటల పాత్రపై బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని పీసీ ఘోష్ కమిషన్ సూచించారు.
రేపు(సోమవారం) తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే, కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. ఇవాళ(ఆదివారం) సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం అధికారుల కమిటీతో మంత్రి ఉత్తమ్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారుల అధ్యయనం పూర్తి అయింది. ఈరోజు సాయంత్రానికి పూర్తిస్థాయిలో నివేదిక పూర్తి చేశారు. కమిషన్ నివేదికపై కేబినెట్ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు కొత్త చరిత్రను సృష్టించాయి: వెంకయ్యనాయుడు
కవిత గురించి మాట్లాడటం వృథా.. జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News