Share News

Jubilee Hills Police VS KTR: కేటీఆర్‌ ఆరోపణలపై స్పందించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:35 PM

మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ మేరకు జూబ్లీహిల్స్ సీఐ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్ని కేసుల్లో హైదరాబాద్ సిటీ పోలీసులు దర్యాప్తు పారదర్శకంగా జరుపుతున్నారని స్పష్టం చేశారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జూబ్లీహిల్స్ సీఐ పేర్కొన్నారు.

Jubilee Hills Police VS KTR: కేటీఆర్‌ ఆరోపణలపై స్పందించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు
Jubilee Hills Police VS KTR

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణలపై స్పందించారు జూబ్లీహిల్స్ పోలీసులు (Jubilee Hills Police). ఈ మేరకు జూబ్లీహిల్స్ సీఐ ఇవాళ(ఆదివారం జులై 27) మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ భార్యపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని పోలీసులపై కేటీఆర్ విమర్శలు చేశారు. కేటీఆర్ ఆరోపణలపై జూబ్లీహిల్స్ సీఐ క్లారిటీ ఇచ్చారు. శ్రీనివాస్ భార్య శ్వేతపై ఎవిడెన్స్ ట్యాంపర్ కేస్ మాత్రమే నమోదు చేశానని తెలిపారు. అన్ని కేసుల్లో హైదరాబాద్ సిటీ పోలీసులు దర్యాప్తు పారదర్శకంగా జరుపుతున్నారని స్పష్టం చేశారు. పోలీసులపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జూబ్లీహిల్స్ సీఐ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..

కర్రు కాల్చి వాత పెట్టాలి.. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 06:04 PM