Hydra: తగ్గేదేలేదంటున్న హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jul 08 , 2025 | 11:02 AM
రాజేంద్రనగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి స్థానికులు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్క్ స్థలం కబ్జా చేయడంతోనే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.

రంగారెడ్డి : అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు (HYDRA officials) కొరడా ఝళిపించారు. రాజేంద్రనగర్‌లో (Rajendranagar) ఇవాళ(మంగళవారం) హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలందానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు నలందానగర్‌కు హైడ్రా అధికారులు చేరుకున్నారు. ఈ క్రమంలో హైడ్రా అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు.
జేసీబీ వాహనాలకు అడ్డంగా మహిళలు పడుకున్నారు. తమ పట్టా భూముల్లో తాము నిర్మాణం చేసుకున్నామని పట్టాదారులు వాదించారు. హైదర్‌గూడ విలేజ్ సర్వే నంబర్‌లోని 16లో 1000 గజాల పార్క్ స్థలం కబ్జా చేసి ప్రహారీ నిర్మించారని హైడ్రా అధికారులు చెబుతున్నారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ ప్రహరీని కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. రాజేంద్రనగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి స్థానికులు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్క్ స్థలం కబ్జా చేయడంతోనే కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. దీంతో హైడ్రా సిబ్బందికి, స్థానికులకు మధ్య ఘర్షణ నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అధికారులు మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదులు వస్తే వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం!
Read Latest Telangana News And Telugu News