Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన..
ABN , Publish Date - Nov 08 , 2025 | 09:10 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వియత్నాం బయలుదేరాల్సిన విమానం రన్‌వే పైనే నిలిచిపోయింది. టేకాఫ్ అవ్వకుండా.. కొన్ని గంటల పాటు ప్రయాణికులతో అలానే ఉండిపోయింది. దీంతో ప్రయాణికులు వియత్నాం ఎయిర్‌బస్సు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి 11 గంటలకు శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ వెళ్లకపోవడంతో రాత్రి నుంచి ప్రయాణికుల నిరసన తెలుపుతున్నారు. విమాన రాకపోకలపై ఎయిర్‌పోర్ట్ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో కూడా సిబ్బంది చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఎయిర్‌లైన్ సిబ్బందిపై మండిపడుతున్నారు. మరోవైపు వీకెండ్ కావడంతో.. విమానాశ్రయం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో విమానంలో 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎదురు చూశారు.
అయితే.. దేశవ్యాప్తంగా తరుచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా కూడా.. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిన్న(శుక్రవారం) కూడా దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో దాదాపు 800 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముందుగా షెడ్యూల్ చేసిన పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.
ఇవి కూడా చదవండి:
షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం
హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం