Share News

HCA Scam Investigation: హెచ్‌సీఏ అక్రమాల కేసు.. నిందితులపై సీఐడీ ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:00 PM

HCA Scam Investigation: బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు గోల్‌మాల్‌పై జగన్‌మోహన్ రావుతో పాటు నిందితులను సీఐడీ విచారిస్తోంది. శ్రీ చక్ర క్లబ్ ఏర్పాటు , ఫోర్జరీ చేసి ఎన్నిక అయిన విధానంపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

HCA Scam Investigation: హెచ్‌సీఏ అక్రమాల కేసు.. నిందితులపై సీఐడీ ప్రశ్నల వర్షం
HCA Scam Investigation

హైదరాబాద్, జులై 17: హెచ్‌సీఏ అక్రమాల (HCA Scam) కేసులో సీఐడీ (CID) కస్టడీ విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కాంటె, శ్రీచక్ర క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేంద్ర యాదవ్, ఆయన భార్య శ్రీ చక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవితను సీఐడీ కస్టడీకి తీసుకుంది. న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగుతోంది. ఫోర్జరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, హెచ్‌సీఏ నిధుల గోల్ మాల్‌పై జగన్‌మోహన్ రావును సీఐడీ ప్రశ్నిస్తోంది. ఆరు రోజులు పాటు నిందితులను విచారించేందుకు సీఐడీకి అనుమతించింది న్యాయస్థానం. ఈరోజు మొదటి రోజు నిందితులను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు గోల్ మాల్‌పై జగన్‌మోహన్ రావుతో పాటు నిందితులను సీఐడీ విచారిస్తోంది. శ్రీ చక్ర క్లబ్ ఏర్పాటు , ఫోర్జరీ చేసి ఎన్నిక అయిన విధానంపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


సర్కార్ కసరత్తు...

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ నుంచి జగన్‌మోహరావును సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీసీసీఐకు సర్కార్ లేఖ రాసింది. విజిలెన్స్ రిపోర్ట్‌ను కూడా బీసీపీఐకి అందజేసింది. హెచ్‌సీఏ ప్రస్తుత బాడీను రద్దు చేయాలని బీసీసీఐకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.


ఉప్పల్ సీఐ సస్పెండ్..

మరోవైపు.. హెచ్‌సీఏ స్కామ్‌ కేసుకు సంబంధించి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్‌లో తలదూర్చిన నేపథ్యంలో సస్పెండ్ అయినట్లు సమాచారం. సీఐడీ వస్తున్నట్లు సమాచారాన్ని హెచ్‌సీఏ సెక్రెటరీ దేవరాజ్‌కు ముందుగా లీక్ చేసినందుకు సీఐను అధికారులు సస్పెండ్ చేస్తూ.. సీపీ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ.. విషయం ఇదే

హెచ్‌సీఏ అక్రమాలు.. కేటీఆర్‌, కవితపై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 17 , 2025 | 07:16 PM