Share News

KTR ON CBN: చంద్రబాబుకు విగ్రహం కట్టు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

ABN , Publish Date - Jul 17 , 2025 | 02:32 PM

MLA KTR: చంద్రబాబుపై ప్రేమ ఉంటే ఇంటిముందు ఆయన విగ్రహం పెట్టుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ సూచించారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ హక్కులను చంద్రబాబుకు రేవంత్ దారదత్తం చేస్తున్నారని ఫైరయ్యారు.

KTR ON CBN: చంద్రబాబుకు విగ్రహం కట్టు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!
MLA KTR

రాజన్న సిరిసిల్ల, జులై 17: సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మరోసారి విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ (BRS Party) మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR). ఈరోజు రాజన్న సిరిసిల్లలో (Rajanna Sircilla) పర్యటించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదిలలో తెలంగాణ హక్కులను తేల్చాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్రానికి ఉత్తరాలు రాసి చంద్రబాబు (CM Chandrababu) తెలంగాణలోని ప్రాజెక్టులు అడ్డుకోలేదా అని గుర్తు చేశారు. కాళేశ్వరం (Kaleshwaram) కట్టినప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని అన్నారు.


చంద్రబాబు చెప్తే ఒప్పుకుంటావా?..

తెలంగాణ జలాలు రేవంత్ రెడ్డి అబ్బసొత్తు, తాత జాగీర్ కాదని అన్నారు కేటీఆర్. ఎవరిని అడిగి కమిటీ వేశావ్? అని సీఎంను నిలదీశారు. చంద్రబాబు అడిగితే కమిటీకి ఒప్పుకుంటావా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై ప్రేమ ఉంటే ఇంటి ముందు ఆయన విగ్రహం కట్టుకో అని సీఎంకు చురకలు అంటించారు. తెలంగాణ హక్కులను చంద్రబాబుకు దారదత్తం చేస్తావా? అని నిలదీశారు. తమకు ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకం కాదని అన్నారు. 'కృష్ణా బోర్డును ఏపీకి తరలించడం గొప్ప విషయమా?.. రేవంత్ రెడ్డి నీకు సిగ్గు లేదా.. చంద్రబాబు ఆడించినట్టు ఆడితే.. కేంద్రానికి బుద్ది చెప్తాం.. తెలంగాణ నీళ్లను తరలిస్తే.. బీఆర్ఎస్ ఊరుకోదు' అంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..

Updated Date - Jul 17 , 2025 | 02:41 PM