Minister Vivek Convoy Accident: మంత్రి వివేక్‌కు తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:29 PM
రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

మెదక్: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ముందు వెళ్తున్న ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో 4 కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టాయని, దీంతో కార్ల ముందు భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ప్రమాదానికి ముందు ఆయన నర్సాపూర్‌లో పర్యటించారు. అర్హులందరికీ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రేషన్ కార్డులను మంత్రి వివేక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మహిళ ఆర్థికంగా నిలబడితేనే కుటుంబం బాగుంటుందన్నారు. అలాగే, విద్యాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం చేస్తుండగా తన కాన్వాయ్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..