Share News

MLA Harish Rao: హరీష్ రావు ఇంట్లో విషాదం..

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:37 AM

మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు.

MLA Harish Rao: హరీష్ రావు ఇంట్లో విషాదం..
Harish Rao

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. దీంతో తన్నీరు కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు ఆలుముకున్నాయి.

ఈ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు, నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరీష్ రావు ఇంటికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివదేహాన్ని ఉంచినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

Election Commission Announced: తమిళనాడు, బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌

Money View App: 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు..!

Updated Date - Oct 28 , 2025 | 06:55 AM