Excise Police Ganja Raid: గంజాయి స్మగ్లింగ్‌లో కొత్త పంథా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:04 PM
Excise Police Ganja Raid: నగరంలోని దూల్‌పేటలో రోహన్ సింగ్ అనే వ్యక్తి కొత్త పంథాలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. ఒడిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చిన అతడు.. దానికి పూజలు చేశారు. రోహన్ సింగ్ వద్ద గంజాయి ఉన్నట్లు పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్, జులై 5: గంజాయిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు (Telangana Police) విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి గంజాయి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. అయితే గంజాయిని తరలించేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటుంటారు స్మగ్లర్లు. కార్లలో, బ్యాగుల్లో, కారు డిక్కీల్లో ఇలా ఎన్నో విధాలుగా గంజాయిని సరఫరా చేసేందుకు యత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పోలీసులకు దొరికిపోతుంటారు స్మగ్లర్లు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్మగ్లర్ మాత్రం అందరికన్నా భిన్నంగా గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. అతడు గంజాయిని దాచిన చోటును చూసి పోలీసులే షాక్ అయిన పరిస్థితి. ఇంతకీ గంజాయిని స్మగ్లర్ ఎక్కడ దాచాడు, ఎలా పోలీసులకు చిక్కాడో ఇప్పుడు తెలుసుకుందాం.
నగరంలోని దూల్‌పేటలో రోహన్ సింగ్ అనే వ్యక్తి కొత్త పంథాలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. ఒడిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చిన అతడు.. దానికి పూజలు చేశాడు. రోహన్ సింగ్ వద్ద గంజాయి ఉన్నట్లు పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో మొత్తం గాలించినప్పటికీ వారికి ఎక్కడా కూడా గంజాయి లభించలేదు. ఇదే సమయంలో పోలీసులు వస్తున్నారని తెలిసిన ఆ వ్యక్తి దేవుడి చిత్ర పటాల వెనక గంజాయి పెట్టి పూజలు చేస్తున్నట్టుగా డ్రామా ఆడాడు. ఇంట్లో సోదాలు చేస్తుంటే పూజలు చేయడంపైన ఎక్సైజ్ పోలీసులకు అనుమానం వచ్చింది.
వెంటనే రోహన్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా.. అసలు విషయం బయటపెట్టాడు స్మగ్లర్. నిజం చెప్పి ఆ వెంటనే పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు కాప్స్. రోహన్ చెప్పిన విధంగా దేవుడి చిత్రపటాల వెనక చూడగా పెద్ద మొత్తంలో గంజాయి లభ్యమైంది. ఒడిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చి దేవుడి చిత్రపటాల వెనుక పెట్టి మరీ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. రోహన్ దూల్‌పేట నుంచి గచ్చిబౌలి వరకు గంజాయిని తీసుకువెళ్లి అమ్ముతున్నట్లు విచారణలో బయటపడింది. రోహన్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు.. అతడి వద్ద నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
పుట్టిన రోజు వేడుకలకు దూరంగా జగ్గారెడ్డి.. ఎందుకంటే
రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ఇన్‌స్టా రీల్
Read Latest Telangana News And Telugu News