Share News

Hyderabad: అర్ధరాత్రి ఆర్డర్లూ అధికమే..

ABN , Publish Date - Jul 05 , 2025 | 08:59 AM

ఆన్‌లైన్‌(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్‌స్టామార్ట్‌ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది.

Hyderabad: అర్ధరాత్రి ఆర్డర్లూ అధికమే..

- గతేడాదితో పోలిస్తే ఎక్కువే

- హైదరాబాద్‌లో పాలకు డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్‌స్టామార్ట్‌ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది. సంస్థ అధ్యయనం ప్రకారం గడిచిన తొలి ఆరు నెలల్లో ఒక వ్యక్తి ఏకంగా 617కు పైగా ఆర్డర్లు చేశాడు. నగరంలో పాలకు అత్యధిక డిమాండ్‌ ఉంది. ఎలక్ట్రానిక్స్‌, బొమ్మలు, వ్యక్తిగత సంరక్షణ విభాగాలు 117 శాతం వృద్ధితో దూసుకుపోతున్నాయి.


city5.2.jpg

ఇడ్లీ, దోశ పిండి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. బ్యూటీ విభాగంలో లిప్‌ లైనర్లు(Lip liners), మినీ లిప్‌స్టిక్‌లు, లిప్‌ బామ్‌లకు డిమాండ్‌ ఉంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వంటనూనె, ఉల్లిపాయలు వంటి నిత్యావసర వస్తువులకు, స్నాక్స్‌ విభాగంలో ఇన్‌స్టంట్‌ న్యూడిల్స్‌(Instant noodles)కు డిమాండ్‌ పెరిగిందని సంస్థ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ హరి కుమార్‌జీ తెలిపారు. సగటు డెలివరీ సమయం 11 నిమిషాలుగా ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు

నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా...

Read Latest Telangana News and National News

Updated Date - Jul 05 , 2025 | 09:33 AM