Jagga Reddy Skips Birthday: పుట్టిన రోజు వేడుకలకు దూరంగా జగ్గారెడ్డి.. ఎందుకంటే
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:59 AM
Jagga Reddy Skips Birthday: ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిర్ణయించారు. తన పుట్టిన రోజు వేడుకలు జరుపొద్దంటూ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.

సంగారెడ్డి, జులై 5: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (TPCC Working President Jaggareddy) తన పుట్టిన రోజుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు జగ్గారెడ్డి. ఈనెల 7న జగ్గారెడ్డి, ఆయన కూతురు జయారెడ్డి పుట్టిన రోజు. ప్రతీ ఏటా వీరి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంగా ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 39 మంది కార్మకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించారు.
సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం జరగడంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో నిమగ్నమైందని.. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియడం లేదని... ప్రస్తుత ఈ విషాద సమయంలో తన పుట్టినరోజు వేడుకలు జరపడం సరైనది కాదంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. ‘కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, నా అభిమానులు ఎవరూ కూడా నా బర్త్ డే వేడుకలు జరపొద్దు. ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టొద్దని’ జగ్గారెడ్డి సూచించారు.
మరోవైపు సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన జరిగి నేటికి ఆరు రోజులు. ఇప్పటికే ఎక్స్‌పర్ట్స్ , హై లెవెల్ కమిటీలు ప్రమాద స్థలిని పరిశీలించాయి. అలాగే ఆరో రోజు కూడా ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవన శిథిలాలను ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా ఇంకా తొమ్మిది మంది ఆచూకీ లభించని పరిస్థితి. ఇప్పటి వరకు ప్రమాదంలో 39 మంది మృతిచెందగా.. 34 మృతదేహాలను గుర్తించారు. పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో ఐదు గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. అలాగే ప్రమాదంలో గాయపడిన వారిలో 23 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 12 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ప్రమాదం నుంచి 60 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి
రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ఇన్‌స్టా రీల్
ఇంగ్లండ్ చెత్త రికార్డు.. టీమిండియాతో పెట్టుకుంటే ఇట్లుంటది!
Read Latest Telangana News And Telugu News