Share News

TG News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Jun 07 , 2025 | 09:50 AM

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

TG News:  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Medchal Accident

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలపై (Road Accident) ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఏదో ఒక ప్రాంతంలో యాక్సిడెంట్లు జరుగుతునే ఉన్నాయి. గమ్యస్థానాలకు వెళ్లాలనే తొందరలో ఓవర్ స్పీడ్‌తో వాహనాలను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు జరుగుతుండటంతో ఆయా కుటుంబాలు తీవ్ర శోకంలో ఉంటున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.


పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఈ విషయం తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదులాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని కారు బలంగా ఢీ కొంది. ఐటీ ఉద్యోగులైన భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ కారులో ప్రయాణిస్తున్నారు. వీరిలో భార్గవ్ యాదవ్, వర్షిత్ మృతిచెందారు. ప్రవీణ్, దినేష్ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కుంట్లూరుకు చెందిన భార్గవ్‌, సైనిక్‌పురికి చెందిన వర్షిత్‌‌గా గుర్తించారు. మద్యం మత్తులోనే యువకులు ఈ రోడ్డు ప్రమాదం చేశారు. ఘట్‌కేసర్‌లోని ఓ రిసార్ట్‌లో యువకులు మద్యం తాగి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాజన్న కోడెలపై రాజకీయం వద్దు: సురేఖ

రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన : డీకే అరుణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 10:15 AM