Dil Raju: ఐటీ అధికారులపై దిల్ రాజ్ ఫైర్.. కారణమిదే..
ABN , Publish Date - Jan 23 , 2025 | 08:50 PM
Dil Raj: టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఐటీ అధికారులపై దిల్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో సోదాలు ముగిసే అవకాశం ఉంది. మూడు రోజులపాటు దిల్ రాజు నివాసంలో సోదాలు కొనసాగాయి. దిల్ రాజు నిర్మించిన సినిమాలు, వచ్చిన లాభాలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. దిల్ రాజు నిర్మాణ సంస్థ ఆర్థిక లావావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించారు. బ్యాంక్ లాకర్లను సైతం ఐటీ అధికారులు ఓపెన్ చేయించారు. దిల్ రాజు సోదరుడు విజయ సింహరెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిగాయి. కాసేపటి క్రితమే విజయ సింహరెడ్డి నివాసంలో సోదాలు ముగిశాయి. ఆటోమొబైల్ రంగంలో విజయ సింహరెడ్డి ఉన్నారు.
దిల్ రాజు, విజయ్ సింహ రెడ్డి మధ్య ట్రాన్స్‌క్షన్‌లను ఐటీ అధికారులు పరిశీలించారు. దిల్ రాజు విజయ సింహారెడ్డి నివాసంలో పలు కీలక డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి ఇళ్లలో బంగారు ఆభరణాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే ఐటీ అధికారులతో దిల్ రాజు వాగ్వాదానికి దిగారు. దిల్ రాజు స్టాఫ్‌ను ఐటీ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. దీంతో ఐటీ అధికారుల తీరుతో దిల్ రాజు వాగ్వాదానికి దిగారు. మూడు రోజులుగా దిల్ రాజు నివాసంలో పనిచేసే స్టాఫ్ ఫోన్‌లను తమ వద్దే ఐటీ అధికారులు ఉంచుకున్నారు. సోదాలు ముగిసిన అనంతరం మీడియాతో దిల్ రాజు మాట్లాడానున్నారు.