CV Anand: ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Nov 16 , 2025 | 09:43 AM
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అభినందించారు.
హైదరాబాద్, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ( Immadi Ravi)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Hyderabad Cyber Crime Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులకు దమ్ముంటే తనను పట్టుకోవాలని కొన్ని రోజుల ముందు సవాల్ చేశారు ఇమ్మడి రవి. ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు నిన్న(శనివారం) అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇమ్మడి రవి అరెస్ట్‌పై తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ (CV Anand) స్పందించారు. రవి అరెస్ట్‌పై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీవీ ఆనంద్ ట్వీట్ పెట్టారు.
దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అభినందనలు తెలిపారు. ఇమ్మడి రవిని పట్టుకోవడానికి జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడిందని ప్రశంసించారు. రవిని తప్పా ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుందని గుర్తుచేశారు. దమ్ముంటే పట్టుకోండని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేశారని కొనియాడారు. డీసీపీ కవిత, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌లని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సీవీ ఆనంద్.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News and National News