Share News

Bonalu Festival: దేశ రాజధానిలో బోనాల జాతర

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:46 PM

Bonalu Festival: గత పదేళ్ల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్ లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు.

Bonalu Festival: దేశ రాజధానిలో బోనాల జాతర
Bonalu Festival

న్యూఢిల్లీ, జూన్ 28: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) మూడు రోజుల పాటు లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు (Bonalu Festival) జరుగనున్నాయి. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు జూన్ 30 నుంచి జూలై 2వ వరకు ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నామని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. జూన్ 30న తెలంగాణ భవన్‌లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. జూలై 1న ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుందన్నారు. జూలై రెండవ తేదీన పోతురాజు, కళాకారుల నృత్యాలు ఉంటాయని వెల్లడించారు.


గత పదేళ్ల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో పలువురు ప్రముఖులు రాబోతున్నారని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.


మరోవైపు తెలంగాణలో ఆషాఢ మాస బోనాల సందడి మొదలైంది. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 26న గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల జాతరకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జూన్ 26 నుంచి మొదలైన బోనాల జాతర జూలై 24తో ముగుస్తాయి. ముందుగా గొల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. ఆ తరువాత జూలై 21న లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇక చివరగా గోలక్కొండ కోటలో బోనాల సమర్పణతో బోనాల సంబరాలు ముగియనున్నాయి.


ఇవి కూడా చదవండి

యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్

2050లో హైదరాబాద్‌ ఎలా ఉండబోతోంది?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 28 , 2025 | 12:51 PM