Hanumakonda: ఘోరం.. మహిళను వివస్త్రను చేసి.. చిత్రవధ
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:20 PM
Hanumakonda: తాటికాయల గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో చిక్కుడు రాజు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

హనుమకొండ, జూన్ 28: జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన వెలుగు చూసింది. ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఈ దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను ఇనుప గ్రిల్స్ కట్టి, వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి చిత్రవధకు గురి చేశారు. తప్పు చేశామని క్షమించాలని వేడుకున్నా కూడా వినకుండా దాడి చేశారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
తాటికాయల గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో రాజు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పదిరోజుల క్రితం ఇద్దరు కలిసి గ్రామం నుంచి పారిపోయారు. వీరిద్దరి కోసం గాలించిన రాజు కుటుంబసభ్యులు ఎట్టకేలకు వారిని వెతికి పట్టుకుని తాటికాయల గ్రామానికి తీసుకొచ్చారు. ఆపై మహిళ పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. ఆమెను ఇనుప గ్రిల్స్‌కు కట్టి వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి దారుణంగా చిత్రవధ చేశారు. తరువాత ఇద్దరికీ గుండు గీయించారు.
ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన నేడు వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన అనంతరం రాజు, మహిళ కనిపించకుండా పోయారు. మహిళపై దాడి దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ధర్మసాగర్ పోలీసులు తాటికాయల గ్రామానికి చేరుకుని దాడిలో పాల్గొన్న కుటుంబసభ్యుల వివరాలను సేకరించారు. మహిళను చిత్ర హింసలకు గురిచేసిన కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కనిపించకుండా పోయిన రాజు, మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్
యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్
Read Latest Telangana News And Telugu News