Share News

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కొత్త వ్యూహం

ABN , Publish Date - Apr 18 , 2025 | 11:50 AM

BJP Strategy: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ హై కమాండ్ కార్యచరణ రూపొందించింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇవాళ జరిగే సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కొత్త వ్యూహం
Hyderabad MLC Elections

హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ పరిధిలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఆ పార్టీ హై కమాండ్ బేగంపేట హరిత హోటల్‌లో సమావేశం నిర్వహించనుంది. ఇవాళ్టి సమావేశంలో పార్టీ నేతలకు కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం కోసం బీజేపీకి సంఖ్య బలం లేకున్నా ఈ స్థానంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది.


హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరావును ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు కాంగ్రెస్ ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌కు పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కావడం కోసం కమలం నేతలు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 110 మంది ఉన్నారు. ఎంఐఎంకు 49 ఓట్లు, బీఆర్ఎస్‌కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్‌కు 14 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ఈ ఎన్నికల బరిలో నిలబెట్టలేదు. బీజేపీకి గెలిచే అంతా బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికీ మద్దతిస్తాయనేది చూసిన తర్వాత ఓ నయా ప్లాన్ రూపొందించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Articles: వెయ్యి కేజీల బంగారాన్ని కరిగించిన గుళ్లు.. ఎందుకంటే..

Hyderabad Student Suicide: బెట్టింగ్‌కు యువకుడి బలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 12:06 PM