GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం.. బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన
ABN , Publish Date - Jan 30 , 2025 | 09:55 AM
GHMC Council Meeting: మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ 10వ కౌన్సిల్ సమావేశం ప్రారంభంకానుంది. బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పేరేటర్లు మేయర్‌ను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. కమలం పార్టీ నేతలు వినూత్న రీతిలో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చి నిరసన తెలుపుతున్నారు.

హైదరాబాద్, జనవరి 30: జీహెచ్‌ఎంసీ 10వ కౌన్సిల్ సమావేశం (GHMC Council Meeting) మరికాసేపట్లో ప్రారంభంకానుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మొదట బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం తరువాత ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. అయితే బడ్జెట్‌లో పెట్టిన ప్రతిపాదనలపై బీజేపీ కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. అలాగే పార్టీ మారడంతో మేయర్‌పై బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కూడా అసహనంతో ఉన్నారు. మేయర్‌ను నిలదీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. మరోవైపు కౌన్సిల్ సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ అక్కడకు చేరుకున్నారు. బిక్షాటన చేసుకుంటూ కమలం పార్టీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. జీహెచ్‌ఎంసీ అప్పుల ఊబిలో ఉందని, జీహెచ్ఎంసీలో పరిస్థితి దారుణంగా ఉందని బీజేపీ కార్పొరేటర్లు చెబుతున్న పరిస్థితి.
మరోవైపు మినిస్టర్ క్వాటర్స్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) నివాసంలో గ్రేటర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం కొనసాగుతోంది. మంత్రి శ్రీధర్ బాబు, మేయర్, డిప్యూటీ మేయర్, గ్రేటర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని మంత్రి దిశా నిర్దేశం చేస్తున్నారు. మీటింగ్ అనంతరం జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌కు నేతలు వెళ్లనున్నారు. కాగా.. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో అత్యంత భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సమావేశం చరిత్రలోనే తొలిసారిగా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల నిరసన నేపథ్యంలో వందలాది మంది పోలీసులను మోహరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నలుదిక్కుల భారీగా పోలీసులు చేరుకున్నారు.
మనువడిపై తాత ప్రేమ.. ఎలా సాయం చేస్తున్నాడో చూడండి..
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన 10:30 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభంకానుంది. మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై కౌన్సిల్‌లో చర్చ జరుగనుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాల సమయం జరుగనుంది. ఓ వైపు బీజేపీ, మరోవైపు బీఆర్‌ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉన్న తరుణంలో ఏకగ్రీవంగా బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం చెందే అవకాశం లేదని బల్దియా వర్గాలు చెబుతున్నాయి. కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ను బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు టార్గెట్ చేయనున్నారు. కౌన్సిల్‌లో మేయర్‌ను నిలదీసేందుకు గులాబీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే కౌన్సిల్ సమావేశంపై రాష్ట్ర రాయకులతో బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. కౌన్సిల్‌లో ప్రతి పక్షాల తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ కూడా వ్యూహారచన చేసింది. నిన్న సాయంత్రం ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో భేటీ అయ్యి కౌన్సిల్ వ్యూహాలపై మేయర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చర్చించారు.
ఇవి కూడా చదవండి...
నేటి నుంచి ‘వాట్సాప్ పరిపాలన’
డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ.2.53 లక్షలు కొట్టేశారుగా..
Read Latest Telangana News And Telugu News