AICC Meetings: బీజేపీని ఖతం చేస్తా.. రాహుల్ సమక్షంలో రేవంత్ పవర్ఫుల్ స్పీచ్
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:27 PM
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. గాడ్సే వారసులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. గాంధీ వారసులకు, గాడ్సే వారసుల మధ్య రాజకీయ పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

గాంధీ పరివార్‌కు, గాడ్సే పరివార్‌కు మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటంలో గెలుపు గాంధేయవాదులదేనని తెలంగాణ ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అహ్మదాబాద్ వేదికగా జరగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని ఖతం చేయడమే తమ లక్ష్యమన్నారు. మోదీ గ్యారంటీలతో దేశ ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని విమర్శించారు. మణిపూర్‌లో అశాంతి, ఢిల్లీలో రైతుల ఆందోళనపై మోద ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మాట ఇస్తే అమలు చేసి తీరుతామన్నారు. రాహుల్ గాంధీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆ ఇద్దరికే ఉద్యోగాలు
దేశంలో ఉద్యోగాలు లేక యువత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏడాదకి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని అడిగారు. గాడ్సే వారుసులతో లడాయికి గాంధేయవాదులు సిద్ధంగా ఉన్నారన్నారు. కేవలం మోదీ, అమిత్ షాకు తప్ప సామాన్యులకు ఉద్యోగాలు రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహిళలు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆంగ్లయుల కంటే గాంధీజీని చంపిన గాడ్సే వారసులైన బీజేపీ నాయకులతో ఈ దేశానికి ఎంతో ప్రమాదకరమని విమర్శించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో గాంధీ ఆలోచనలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ నేతలు ఇక ఎక్కువకాలం ప్రజలను మోసం చేయలేరన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాలో రైతు రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని, లక్షలాది మది రైతులు, వారి కుటుంబాల్లో సంతోషం నింపామని చెప్పారు. తెలంగాణలో కులగణన చేశామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పెంపును అనుమతించాని జంతర్ మంతర్‌లో ధర్నా చేశామన్నారు.
బీజేపీకి సవాల్
తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనీయబోనని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన గడ్డపై సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయని, ఇక్కడి సమావేశాల స్ఫూర్తితో తిరిగి తెలంగాణకు వెళ్లి బీజేపీని ఖతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. అక్కడి ప్రజలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి తీరుతామన్నారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, రానున్న రోజుల్లో మోదీ ప్రజలను మాయ చేయలేరన్నారు. ప్రజల సమస్యలపై రాహుల్‌గాంధీకి పూర్తి అవగాహన ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here