Share News

GHMC: వర్షమా.. అయితే మాకేం సంబంధం..

ABN , Publish Date - Jul 19 , 2025 | 09:49 AM

ఒక్క వాన.. నగరంలో వరద నీటి ప్రవాహ వ్యవస్థ డొల్లతనమే కాదు.. ప్రభుత్వ విభాగాల వైఫల్యాన్నీ బహిర్గతం చేసింది. కుంభవృష్టితో మహానగర పౌరులు అవస్థలు పడుతున్నా.. గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌తో తిప్పలు పడినా పట్టించుకున్న నాథుడు లేడు. అక్కడక్కడా మినహా అత్యవసర బృందాలు కనిపించలేదు.

GHMC: వర్షమా.. అయితే మాకేం సంబంధం..

- క్షేత్రస్థాయిలో కనిపించని జీహెచ్‌ఎంసీ సిబ్బంది, కమిషనర్‌

హైదరాబాద్‌ సిటీ: ఒక్క వాన.. నగరంలో వరద నీటి ప్రవాహ వ్యవస్థ డొల్లతనమే కాదు.. ప్రభుత్వ విభాగాల వైఫల్యాన్నీ బహిర్గతం చేసింది. కుంభవృష్టితో మహానగర పౌరులు అవస్థలు పడుతున్నా.. గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌తో తిప్పలు పడినా పట్టించుకున్న నాథుడు లేడు. అక్కడక్కడా మినహా అత్యవసర బృందాలు కనిపించలేదు. పలు డివిజన్లలో ఇళ్లలోకి వరద నీరు వచ్చిన ప్రాంతాలను సందర్శించిన కార్పొరేటర్లు.. డిప్యూటి మునిసిపల్‌ కమిషనర్‌, ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్లకు ఫోన్‌ చేసినా స్పందించక పోవడం గమనార్హం.


మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) అప్రమత్తంగా ఉండండి అని ఓ ప్రకటన విడుదల చేసి మిన్నకున్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చిన బల్దియా కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ కూడా క్షేత్రస్థాయిలో కనిపించ లేదు. వివిధ ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీరు పోయేందుకు వర్షపు నీరు డ్రెయినేజీ ఎక్కడుందో వెతికేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఇబ్బందులు పడ్డారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌ మినహా ప్రధాన శాఖల అధికారులెవ్వరూ రోడ్లపైకి రాలేదు.


city6.2.jpg

అనుభవం లేని హైడ్రా..

హైడ్రాకు మొదటి సారి బాధ్యతలు అప్పగించడం.. ఆ సంస్థలో సరిపడా అధికారులు, ఉద్యోగులు లేకపోవడం వరద నీటి నిర్వహణ పనులపై ప్రభావం చూపింది. ఎక్కడ రహదారులపై భారీగా వరద నీరు నిలుస్తుంది..? ఏ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చే అవకాశముందన్న దానిపై హైడ్రా యంత్రాంగానికి అవగాహన లేదు. పరిమిత స్థాయిలో ఉద్యోగులు ఉండడంతో అత్యవసర బృందాల పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడమూ సాధ్యపడలేదు. వార్డు, సర్కిల్‌ స్థాయిలో హైడ్రాకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు అధికారుల నుంచి సహకారం లోపించింది. ఇది మొత్తంగా మహానగరం ముంపునకు కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

Read Latest Telangana News and National News

Updated Date - Jul 19 , 2025 | 09:49 AM