AP Flights Cancelled: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. విమానాలు రద్దు..
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:03 PM
మొంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది.
హైదరాబాద్: మొంథా తుపాన్ ప్రభావం కారణంగా శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వెళాల్సిన విమానాలు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్ నుంచి బయల్దేరాల్సిన 18 విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మొంథా తుపాన్ కారణంగా వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
మొంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. రహదారులపై నీరు చేరడంతో.. చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీలు వరద నీరుతో జలదిగ్బంధం అయ్యాయి. తుపాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకోవడంతో ఏపీకి రావాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు.
ఇవి కూడా చదవండి..
Election Commission Announced: తమిళనాడు, బెంగాల్‌లో ఎస్‌ఐఆర్
Money View App: 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు..!